ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం

వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు శెనార్తిమీడియా, రామడుగు : మాజీ ప్రధాని, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు కొనియాడారు. దేశ సమగ్రత, అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. జీపీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ధైర్యసాహసాలు, దృఢమైన నాయకత్వం దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవానికి ప్రోత్సాహం,...