‘ఇందిరమ్మ బీమా’తో కుటుంబాలకు ఆర్థిక భరోసా

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శెనార్తిమీడియా, గంగాధర, రామడుగు : ఇందిరమ్మ కుటుంబ బీమాతో ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్​ జీపీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేరాలని ఆకాంక్షించారు. ఆపద...