SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 6:02 pm Posted by : SHENARTHI MEDIA

జిల్లాస్థాయి గ్రంథాలయ వారోత్సవాల్లో సెయింట్ జార్జ్ విద్యార్థుల ప్రతిభ

శెనార్తిమీడియా, కొత్తపల్లి :
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ విద్యార్థులు ప్రతిభ చాటినట్లు స్కూల్ చైర్మన్ ఫాతిమారెడ్డి తెలిపారు. తొమ్మిదో తరగతికి చెందిన శివ దీక్షిత చిత్రలేఖనంలో ద్వితీయ స్థానం, ఏడో తరగతికి చెందిన కీర్తి రెడ్డి పాటల పోటీల్లో ద్వితీయ స్థానం, ఎనిమిదో తరగతికి చెందిన స్వరశ్రీ రంగోళి విభాగంలో ద్వితీయ స్థానం, తొమ్మిదో తరగతికి చెందిన రణ్విత మెహందీ విభాగంలో ద్వితీయ స్థానం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇలాంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.