మహిళ అనుమానాస్పద మృతి
12 రోజుల తర్వాత మృతదేహం వెలికితీత శెనార్తిమీడియా, గంగాధర : గంగాధర మండలం రంగారావుపల్లికి చెందిన దోమకొండ శంకరమ్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఆమె మృతదేహాన్ని పోలీసులు 12 రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. శంకరమ్మ ఈ నెల 8వ తేదీ రాత్రి మృతిచెందింది. కుటుంబసభ్యులు మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి చిన్నమ్మ శంకరమ్మ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ నవంబర్ 20న గంగాధర పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీయించి తహసీల్దార్ అంబటి రజిత సమక్షంలో...