బెల్ట్ షాపులు మూసేయాలని మహిళల ఆందోళన
శెనార్తి మీడియా, శంకరపట్నం: తమ గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న మద్యం బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని శంకరపట్నం మండలం కాచాపూర్ మహిళలు శనివారం ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి సర్పంచ్ ఊకంటి మాధవికి తమ సమస్యలను వివరించారు. గ్రామంలో బెల్ట్ షాపుల కారణంగా యువకులు, కూలీలు మద్యానికి అలవాటుపడి సంపాదనంతా తాగుడుకే ఖర్చు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అక్రమ మద్యం విక్రయాలను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ఆందోళన...