కట్టుకున్నోడే కాలయముడు
వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు భర్త, మనవడి అరెస్ట్ హత్యకు ఉపయోగించిన చీర స్వాధీనం శెనార్తిమీడియా, గంగాధర : గంగాధర మండలం రంగారావుపల్లికి చెందిన దోమకొండ శంకరమ్మ (70)ను తన భర్త రామయ్యనే హతమార్చారు. సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం రంగారావుపల్లికి చెందిన శంకరమ్మ ఈ నెల 8న అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కుటుంబసభ్యులు మరుసటి రోజు ఆమె దహన సంస్కారాలు పూర్తిచేశారు. శంకరమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి కుమారుడు దోమకొండ అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వంశీకృష్ణ...