డిసెంబర్ 1 నుంచి కాచాపూర్‌లో మద్యం విక్రయాలు నిషేధం

బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.లక్ష జరిమానా గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయం శెనార్తి మీడియా, శంకరపట్నం: మద్యం విక్రయాల వల్ల కుటుంబాల్లో తలెత్తుతున్న సమస్యలను అరికట్టి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు కొనసాగిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మద్యం సేవించడం వల్ల కుటుంబాల్లో గొడవలు పెరుగుతున్నాయని, మహిళలు, పిల్లలు తీవ్ర...