SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 5:25 pm Posted by : SHENARTHI MEDIA

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు సెయింట్​ జార్జ్​ స్టూడెంట్​

జిల్లాస్థాయి పోటీల్లో కాంస్య పతకం

శెనార్తిమీడియా, కొత్తపల్లి :

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు కొత్తపల్లి పట్టణంలోని సెయింట్​ జార్జ్ ఇంటర్నేషనల్​​ స్కూల్ స్టూడెంట్​ ఎంపికైనట్లు స్కూల్​ చైర్మన్ పి.ఫాతిమారెడ్డి తెలిపారు. నవంబర్ 22న సెంటినరీ కాలనీ రాణి రుద్రమదేవి స్టేడియంలో నిర్వహించిన ఎస్జీఎఫ్​ జిల్లాస్థాయి ఆర్చరీ టోర్నమెంట్‌లో అండర్​ 14 విభాగంలో విన్మయి పాల్గొని కాంస్య పతకాన్ని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. నవంబర్ 28న నిర్మల్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విన్మయి పాల్గొంటుందని ఆయన వివరించారు. ఆర్చరీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విన్మయిని చైర్మన్ ఫాతిమారెడ్డి అభినందించారు.