రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు సెయింట్ జార్జ్ స్టూడెంట్
జిల్లాస్థాయి పోటీల్లో కాంస్య పతకం శెనార్తిమీడియా, కొత్తపల్లి : రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ ఎంపికైనట్లు స్కూల్ చైర్మన్ పి.ఫాతిమారెడ్డి తెలిపారు. నవంబర్ 22న సెంటినరీ కాలనీ రాణి రుద్రమదేవి స్టేడియంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి ఆర్చరీ టోర్నమెంట్లో అండర్ 14 విభాగంలో విన్మయి పాల్గొని కాంస్య పతకాన్ని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. నవంబర్ 28న నిర్మల్లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విన్మయి పాల్గొంటుందని ఆయన వివరించారు. ఆర్చరీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విన్మయిని చైర్మన్...