SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 7:56 pm Posted by : SHENARTHI MEDIA

మొలంగూర్ దూద్‌బావిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

డీపీవో జగదీశ్
శెనార్తి మీడియా, శంకరపట్నం:
మండలంలోని చారిత్రక మొలంగూర్ దూద్‌బావిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని డీపీవో జగదీశ్ తెలిపారు. బావిని సందర్శించిన ఆయన దాని చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేకతలను సర్పంచ్ పూదరి రాజును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం వంకాయగూడెం, మొలంగూర్ గ్రామాల్లో పర్యటించి పలు పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్, వంకాయగూడెం సర్పంచ్, మొలంగూర్ సర్పంచ్ పూదరి రాజు, డీపీఎం, పంచాయతీ కార్యదర్శి గురవయ్య, కారోబర్ మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు.