మొలంగూర్ దూద్బావిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
డీపీవో జగదీశ్ శెనార్తి మీడియా, శంకరపట్నం: మండలంలోని చారిత్రక మొలంగూర్ దూద్బావిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని డీపీవో జగదీశ్ తెలిపారు. బావిని సందర్శించిన ఆయన దాని చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేకతలను సర్పంచ్ పూదరి రాజును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం వంకాయగూడెం, మొలంగూర్ గ్రామాల్లో పర్యటించి పలు పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్, వంకాయగూడెం సర్పంచ్, మొలంగూర్ సర్పంచ్ పూదరి రాజు, డీపీఎం, పంచాయతీ కార్యదర్శి...