Monday, August 3, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్మొలంగూర్ లో విషాదం

మొలంగూర్ లో విషాదం

📰 Generate e-Paper Clip

అల్లయ్య కుంటలో  మునిగి బాలుడి మృతి

 

శెనార్తి మీడియా, శంకరపట్నం:

శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని అల్లయ్య కుంటలో మునిగి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన వీనా సాహిని, భవిత దేవి దంపతులు బతుకుతెరువు నిమిత్తం మొలంగూర్ గ్రామానికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కుమారుడు రిత్విక్ (8) ఆదివారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అల్లయ్య కుంటలో పడి మునిగిపోయాడు. స్థానికులు బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.