శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండల పరిధిలోని 27 గ్రామ పంచాయతీల్లో వికలాంగుల, వితంతువులు, ఒంటరి మహిళల చేయూత పెన్షన్ కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన వారు ఆగస్టు 5, 2026 సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.
దరఖాస్తుదారులు అవసరమైన సంబంధిత పత్రాలతో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

