Tuesday, October 20, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్నాగిరెడ్డిపూర్ లో లైట్లు, వైర్లు చోరీ

నాగిరెడ్డిపూర్ లో లైట్లు, వైర్లు చోరీ

📰 Generate e-Paper Clip

శెనార్తిమీడియా, గంగాధర:
గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ లైట్లు, హైమాస్ట్ బల్బును గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి దొంగిలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఊరి చివరి నుండి వాగు వద్ద ఉన్న ఎల్లమ్మ గుడి వరకు సర్పంచ్ గునుకొండ యశోద బాబు ఆధ్వర్యంలో కరెంట్ వైర్లు, ఎల్‌ఈడీ లైట్లు, హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేశారు. బతుకమ్మల నిమజ్జనం అనంతరం దొంగతనం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.