సింగరేణి రిటైర్డ్ కాలనీలో శ్రీ శ్రీ లక్ష్మీ గణేష్ మండలి (SRI SRI LAXMI GANESH MANDALI)
ఆధ్వర్యంలో కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
మండపంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య మహిళలు కుంకుమార్చన చేపట్టారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి మహాహారతి నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో కాలనీ ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండలి నిర్వాహకులు మేడం తిరుపతి, ఎంబండి సమ్మయ్య, కనవేని ఓదెలు, రామంచ సంపత్, ఆంజనేయ ప్రసాద్, ముష్కే రవి, కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం నాంపల్లి తిరుపతి, గాండ్ల సుధీర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల:

