శెనార్తిమీడియా, కరీంనగర్ :
కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కొత్తబట్టలు కట్టుకుని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి కూడళ్లలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బతుకమ్మ పేర్చారు.
రామడుగు మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత తన స్వగ్రామమైన వెలిచాలలో బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను ప్రతి మహిళ ఆనందంగా జరుపుకుంటారని ఆమె పేర్కొన్నారు.


