వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు
శెనార్తిమీడియా, రామడుగు :
పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా 20వ శ్రమదానాన్ని రేణుకా ఎల్లమ్మ దేవాలయం పరిసరాల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం భద్రంగా ఉంటుందని, తద్వారా రోగాలు దూరంగా ఉంటాయన్నారు. ప్రజలు చెత్తను ఆరుబయట ఎక్కడపడితే అక్కడ వేయకుండా డస్ట్ బిన్లలో వేయాలన్నారు. మన ఇల్లు, వీధి, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనందరి విధి అని గుర్తుచేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గౌడ సంఘం అధ్యక్షుడు దైవాల హనుమాండ్లు, మాజీ సర్పంచ్ పెద్దిగారి ఎల్లయ్య, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
RELATED ARTICLES

