శెనార్తిమీడియా, కొత్తపల్లి :
కొత్తపల్లి మండలం రేకుర్తి విజన్ హైస్కూల్ లో ముందస్తు దీపావళి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. స్కూల్ కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి రకరకాల దీపాలతో స్కూల్లో దీపాలంకరణ చేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో విద్యార్థులు చేసిన నృత్యాలు, నాటిక అందరినీ అలరించాయి. అనంతరం స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులందరూ టపాసులకు దూరంగా ఉంటూ గ్రీన్ దీపావళిని జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సందవేణి వెంకట్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్స్ పాల్గొన్నారు.


