14 రోజుల రిమాండ్
శెనార్తి మీడియా, శంకరపట్నం :
దుర్గామాత నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన నిందితుడిని కేశవపట్నం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్టోబర్ 21న నిమజ్జనం సందర్భంగా తాడికల్ గ్రామానికి చెందిన జనగాం మణికంఠ మొలుగురి హరీష్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో హరీష్ కంటి పైభాగం, తలకు గాయాలయ్యాయి. బాధితుడు హరీష్ ఫిర్యాదు మేరకు కేశవపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు జనగాం మణికంఠను శుక్రవారం అరెస్టు చేసి హుజూరాబాద్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శేఖర్ రెడ్డి హెచ్చరించారు.

