Sunday, August 2, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్స్కూటీ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

స్కూటీ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం:

శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని జేసీఎం ఫంక్షన్ హాల్ ఎదురుగా స్కూటీ అదుపుతప్పి పడిపోవడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన భూక్యా రాములు (55) నర్సంపేటలో నివసిస్తున్న తన కుమార్తె ఇంటికి స్కూటీపై వెళ్తుండగా మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడి కనుబొమ్మ, కుడి మోకాలు, కుడి చేతి మణికట్టు వద్ద తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. దీంతో ఈఎంటీ గూడూరి సతీష్ రెడ్డి, పైలట్ మత్తి గోపికృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌లో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.