Tuesday, August 4, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్పోలీసుల అదుపులో దొంగలు..? కాచాపూర్‌లో కలకలం

పోలీసుల అదుపులో దొంగలు..? కాచాపూర్‌లో కలకలం

📰 Generate e-Paper Clip

 శెనార్తి మీడియా, శంకరపట్నం:

మండలంలొని కాచాపూర్ లో   ఆదివారం రాత్రి ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

అదే సమయంలో గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసు వాహనం సైరన్ వినగానే ముగ్గురు అనుమానితులు ఓ ఇంటి పక్కకు పరుగెత్తి తప్పించుకునేందుకు యత్నించగా, పోలీసులు వారిని గమనించారు. వెంటనే గ్రామస్తుల సహకారంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

అనుమానితులను శంకరపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. వారు గ్రామంలో ఎందుకు సంచరించారు, దొంగతనాలకు పాల్పడే ఉద్దేశంతో వచ్చారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.