Friday, August 7, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్పోగొట్టుకున్న మొబైల్ అప్పగింత

పోగొట్టుకున్న మొబైల్ అప్పగింత

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం:

శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామానికి చెందిన గాజుల సామ్‌సన్ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేశవపట్నం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సహాయంతో మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి గుర్తించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను బాధితుడికి అప్పగించారు.

ఈ సందర్భంగా కేశవపట్నం ఎస్‌ఐ శేఖర్ రెడ్డి మాట్లాడారు., సెల్ ఫోన్ పోయిన వెంటనే సమీప ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా
గుర్తించి తిరిగి అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.