శెనార్తి మీడియా, శంకరపట్నం:
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్ అర్హత నిబంధనలు పేదలు, వృద్ధులు, వితంతు మహిళలకు అన్యాయం చేస్తున్నాయని బీజేపీ శంకరపట్నం మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ విమర్శించారు. వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితిని 70 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాలని, వితంతు మహిళలకు వయోపరిమితి లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అర్హత నిబంధనలను పునఃసమీక్షించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. డిమాండ్లను పట్టించుకోకపోతే మండల వ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

