Wednesday, October 7, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్రెడ్డి జాగృతి రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్‌గా సాయిప్రసాద్ రెడ్డి

రెడ్డి జాగృతి రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్‌గా సాయిప్రసాద్ రెడ్డి

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన అన్నారపు సాయిప్రసాద్ రెడ్డి రెడ్డి జాగృతి రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్ ఉప్పల్‌ బగాయత్‌లో జరిగిన రెడ్డి జాగృతి కమిటీల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మాధవరెడ్డి నియామక పత్రం అందించారు.
ఈ సందర్భంగా సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన మాధవరెడ్డితో పాటు రెడ్డి జాగృతి టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో రెడ్డి జాగృతి కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రెడ్డిల హక్కుల కోసం పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.