శెనార్తిమీడియా, కొత్తపల్లి :
ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు కొత్తపల్లి మండలం రేకుర్తి విజన్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్ కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ తెలిపారు. డిస్ట్రిక్ట్ ఆథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీజియన్ స్పోర్ట్స్ స్కూల్ లో గురువారం జరిగిన 12వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్, జూనియర్ ఆథ్లెటిక్స్ పోటీల్లో విజన్ హైస్కూల్ విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాలలో బంగారు , వెండి , కాంస్య పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. అండర్ -10 విభాగంలో లాంగ్ జంప్ లో బి.శివాన్స్ వెండి, ఆర్.రితిక్ కాంస్య, అండర్ -12 విభాగం 80 మీటర్ల పరుగు పందెంలో జి.సాయితేజ బంగారు పతకం, లాంగ్ జంప్ లో బంగారు పతకం, కె.రిత్విక్ వెండి, అండర్- 14 విభాగం 80 మీటర్ల పరుగు పందెంలో బి.శివ సాయి బంగారు, సీహెచ్.వైష్ణవి 300 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం సాధించినట్లు చెప్పారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు జి.సాయితేజ , బి.శివసాయి, కె. రిత్విక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఈ నెల 30, డిసెంబర్ 1న నిజామాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సందవేణి వెంకట్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

