శెనార్తిమీడియా, కరీంనగర్ :
అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కొత్తపల్లి మండలం రేకుర్తి సాన్వి జూనియర్, డిఫెన్స్ విద్యార్థులు ఎంపికైనట్లు కాలేజీ చైర్మన్ ఎర్రంశెట్టి మునిందర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మినీ స్టేడియంలో ఈ నెల 10, 11, 12వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ అండ్ వుమెన్ అట్య పట్య క్రీడల్లో పాల్గొంటారన్నారు. బాలికల విభాగం నుండి డి.నవనీత, కె.హరిణి, కె.శ్రీవర్షిణి, పి.శ్రావిక, ఆర్.రుచిత, బాలుర విభాగం నుంచి పి.అభిరామ్ రావు, సాత్విక్, విజయ్ కుమార్, శివతేజ, రోహిత్, నిత్యసాయి కరీంనగర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. వీరిని కళాశాల చైర్మన్ ఎర్రంశెట్టి మునిందర్, కోచ్ లు శ్రీనివాస్, లక్ష్మణ్, నవ్య, స్వర్ణ అనీష్ ప్రిన్సిపల్ రత్నాకర్, లెక్చరర్స్ అభినందించారు.
అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు ‘సాన్వి’ విద్యార్థులు
RELATED ARTICLES

