Tuesday, October 6, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్వెలిచాలలో కోలాటం ఉచిత శిక్షణ

వెలిచాలలో కోలాటం ఉచిత శిక్షణ

📰 Generate e-Paper Clip

శెనార్తిమీడియా, రామడుగు:
ప్రజాజీవితంలో జానపదుల జీవితాలతో కోలాటం నృత్యం పెన వేసుకుపోయింది. పిల్లలను, పెద్దలను అందరినీ అలరించే కళారూపం కోలాటం. కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రిపూట పొద్దు పోయే వరకూ చేస్తూ ఉంటారు. రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు బతుకమ్మ పండుగ నేపథ్యంలో తన ఊరి ఆడబిడ్డలకోసం కోలాటం ఉచిత శిక్షణను సోమవారం సాయంత్రం ప్రారంభించారు. గ్రామంలోని ఆడపడుచులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.