Sunday, October 11, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్సర్పంచుకు పరామర్శ

సర్పంచుకు పరామర్శ

📰 Generate e-Paper Clip

శెనార్తిమీడియా, రామడుగు :

రామడుగు మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు ఒంటెల వెంకటరమణారెడ్డి తల్లి శ్రీరాములపల్లి సర్పంచ్ ఒంటెల సుగుణమ్మ ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరగడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. కరీంనగర్​ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి విశ్రాంతి తీసుకుంటున్న సుగుణమ్మను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్​ రావు శనివారం పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కొక్కరకుంట సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి మాజీ సభ్యుడు వీర్ల సంజీవరావు, నాయకుడు జూపాక మునీందర్ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.