Sunday, October 11, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..?

పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..?

📰 Generate e-Paper Clip

చేతికొచ్చిన పంట నేలపాలవుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదా..?

ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి

మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

శెనార్తిమీడియా, గంగాధర :

పంటలు ఎండుతున్నా, చేతికొచ్చిన పంట నేలపాలవుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని, ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్​ చేశారు. గంగాధర మండలం గర్శకుర్తి, తాడిజెర్రిలో ఎండుతున్న వరి పంటలను శనివారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వేసుకున్న పంటలను కాపాడే క్రమంలో వాటర్​ ట్యాంకు కోసం రోజుకు రూ.3500– రూ.-4000లు వెచ్చించి నీరు పెడుతున్నారని రైతన్న పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా రోజుకు 6 గంటల కరెంట్​ సరఫరా చేయాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మేచినేని నవీన్​ రావు, రామిడి సురేందర్​ రెడ్డి, కంకణాల విజేందర్​ రెడ్డి, ఆకుల మధుసూదన్​ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.