Monday, October 12, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్హలో శ్రీనివాస్.. ఛలో కోరుట్ల

హలో శ్రీనివాస్.. ఛలో కోరుట్ల

📰 Generate e-Paper Clip

శ్రీనివాసులు సేవా సంస్థ మూడో వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

శెనార్తిమీడియా, కరీంనగర్​ :

తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవ పోస్టర్ ను జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం జీఎస్ గార్డెన్​ లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. మూడో వార్షికోత్సవాన్ని ఈ నెల 25న జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జీఎస్ గార్డెన్​ లో నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ ఏర్పడిన మూడేళ్లుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని చేస్తున్నామన్నారు. గతేడాది జరిగిన వార్షికోత్సవంలో ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డులు సాధించుకున్నామన్నారు. ఈ ఏడాది జరిగే వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కోరుట్ల శ్రీనివాస సలహా మండలి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క శ్రీనివాస్​ మరో ఇద్దరు శ్రీనివాసులను తప్పకుండా తీసుకురావాలన్నారు. ఈసారి జరిగే ఈ వేడుకలకు అంగరంగ వైభవంగా జరిగేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని కోరుట్ల శ్రీనివాసుల సలహా మండలి ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరాముల శ్రీనివాస్, నీలి శ్రీనివాస్, బెజ్జరపు శ్రీనివాస్, తూం శ్రీనివాస్, చిలుక శ్రీనివాస్, ఓడ్నాల శ్రీనివాస్, సంగ శ్రీనివాస్, నల్ల శ్రీనివాస్,నార్ల శ్రీనివాస్, పైడ శ్రీనివాస్, ఇజ్జగిరి శ్రీనివాస్,పొన్నం శ్రీనివాస్, జాగిరాల శ్రీనివాస్, రంగా శ్రీనివాస్, ఐలాపూర్ శ్రీనివాస్, పాక శ్రీనివాస్, కటకం శ్రీనివాస్, చింత శ్రీనివాస్, గాజుల శ్రీనివాస్, ఒటారి శ్రీనివాస్ గౌతమ్ విశిష్ట తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.