వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు
శెనార్తిమీడియా, రామడుగు :
పరిశుభ్రతే మన లక్ష్యమని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా రామడుగు మండలం వెలిచాల అనుబంధం కిష్టారావుపల్లిలో 16వ శ్రమదానం- అయ్యవారికుంట ఆలయం, బతుకమ్మ ఘాట్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యవారికుంట భక్తాంజనేయ స్వామి దేవాలయం, బతుకమ్మ ఘాట్ పరిసరాల్లో శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ పరిసరాలు, ఘాట్ మెట్లు, కుంట గట్టు వెంబడి పేరుకుపోయిన చెత్త, ముళ్ల పొదలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన గ్రామమే మన లక్ష్యమని, ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ శ్రమదానం 16వ వారానికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజలందరూ శ్రమదానానికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉప సర్పంచ్ ఎల్లమ్మల వసంత, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

