Sunday, October 18, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్కరీంపేటలో వ్యవసాయ మోటార్ల చోరీ

కరీంపేటలో వ్యవసాయ మోటార్ల చోరీ

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం:

మండలంలోని కరీంపేట గ్రామంలో వ్యవసాయ మోటార్ల చోరీ ఘటన కలకలం రేపింది. పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ముగ్గురు రైతులకు చెందిన విద్యుత్ మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.
శుక్రవారం రాత్రి ములుగురి స్వామి, బొజ్జ అశోక్, వనపర్తి రాజేశం వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసుకున్న మోటార్లను దుండగులు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు మోటార్లు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు.
ఎండల తీవ్రతతో పంటలను కాపాడుకునేందుకు శ్రమిస్తున్న తరుణంలో మోటార్లు చోరీ కావడంతో సాగునీరు అందించడం కష్టంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చోరీకి గురైన మోటార్ల విలువ సుమారు రూ.30 వేల వరకు ఉంటుందని తెలిపారు.
పోలీసులు ఘటనపై విచారణ జరిపి నిందితులను గుర్తించి, చోరీకి గురైన మోటార్లను తిరిగి ఇప్పించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.