శెనార్తి మీడియా, శంకరపట్నం:
విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ‘చదువుకో చదువుకో చదువుకోరా తమ్ముడా.. చదువులోని విజయాన్ని తెలుసుకోరా చెల్లెలా’ అనే పాటను కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ శేఖర్ రెడ్డి విడుదల చేశారు. ఈ పాటను వెన్నెల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ గీతానికి పూదరి అజయ్ కుమార్ సాహిత్యం అందించగా, రామంచ సుమన్, సంధ్య ఆలపించారు. హెచ్‌ఎన్‌కే రికార్డింగ్‌కు చెందిన బిక్షపతి సంగీత బాధ్యతలు నిర్వహించగా, సంతోష్ ఎడిటింగ్ చేశారు. ముసుకు హరీష్ నిర్మాతగా వ్యవహరించారు.
పాట రూపకల్పనలో భాగస్వాములైన పూదరి తిరుపతి, మొలంగూర్ ఫొటోగ్రాఫర్, మొలంగూర్ సర్పంచ్ పూదరి రాజును ఈ సందర్భంగా అభినందించారు.

