Monday, November 9, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇళ్లలో వెలుగులు

ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇళ్లలో వెలుగులు

📰 Generate e-Paper Clip

గంగాధర మండలం ఉప్పరమల్యాల, రామడుగు మండలం వెలిచాలలో ఇందిరమ్మ లబ్ధిదారులతో దీపావళి పండుగ జరుపుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

శెనార్తిమీడియా, గంగాధర, రామడుగు :

ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇళ్లలో వెలుగులు నిండాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం ఉప్పరమల్యాల, రామడుగు మండలం వెలిచాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఆదివారం ఆయన దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, ఈ దీపావళి పండుగ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, డీఆర్డీఏ పీడీ గీత, హౌసింగ్ డీఈ వెంకటరమణ, ఎంపీడీవోలు దమ్మని రాము, సంగి రాజేశ్వరి, తహసీల్దార్​ అంబటి రజిత, ఆయా గ్రామాల సర్పంచులు నగేష్​, వీర్ల నర్సింగారావు, నాయకులు హరీశ్, కాడె శంకర్, శుక్రొద్దీన్, సుధీర్, జక్కుల బాబు, కనకయ్య, ఎలమ్మల కృష్ణ, శివ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.