Wednesday, November 18, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్'వరి' తగ్గించి ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాలి

‘వరి’ తగ్గించి ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాలి

📰 Generate e-Paper Clip

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా రైతులకు అవగాహన
శెనార్తి మీడియా, శంకరపట్నం:

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని, నీటి వినియోగాన్ని తగ్గించే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. తాడికల్ రైతు వేదికలో నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ అవగాహన కార్యక్రమంలో ఎల్‌నినో పరిస్థితుల్లో వ్యవసాయానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్, మానకొండూరు ఏడీఏ శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ రైతులకు పలు సూచనలు చేశారు. నీటి సంరక్షణ, పంటల పరిరక్షణ, నేల ఆరోగ్యం, భూసార పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించారు. వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ కాలపరిమితి, తక్కువ నీరు అవసరమయ్యే అపరాలు, నూనెగింజలు, ఇతర ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలతో పాటు ఈ పంటను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఇతర రాయితీల గురించి వివరించారు. కార్యక్రమంలో తాడికల్ పీఏసీఎస్ చైర్మన్ సంపత్, ఉప సర్పంచ్ ప్రవీణ్, ఏఈఓ ఆరతి, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.