శెనార్తి మీడియా, శంకరపట్నం:
బాలలను పనిలో పెట్టుకున్న కేవీకే గ్రానైట్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆపరేషన్ ముస్కాన్-12లో భాగంగా హుజూరాబాద్ (ఎఫ్‌ఏసీ) సహాయ కార్మిక శాఖ అధికారి గుండాటి చక్రధర్ రెడ్డి తన బృందంతో కలిసి శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే గ్రానైట్స్‌లో స్టోన్ కటింగ్, డ్రిల్లింగ్ పనులకు 18 సంవత్సరాలు నిండని ముగ్గురు బాలలను పనిలో పెట్టుకున్నట్లు గుర్తించారు.
దీనిపై బాలలను పనిలో పెట్టుకున్న వ్యక్తితో పాటు కేవీకే గ్రానైట్స్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సహాయ కార్మిక శాఖ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేవీకే గ్రానైట్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి వెల్లడించారు.

