శెనార్తి మీడియా, పెద్దపల్లి:
యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న యాదవ విద్యార్థి వసతి గృహ భవన నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం చేపట్టనున్న యాత్రకు సంబంధించి కీలక సమావేశాన్ని ఆగస్టు 4 (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఉన్న యాదవ చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని యాదవ చారిటబుల్ ట్రస్ట్, అఖిల భారత యాదవ మహాసభ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
సమావేశంలో యాత్ర నిర్వహణ, కార్యాచరణ ప్రణాళిక, నిధుల సమీకరణ విధానం, మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతల కేటాయింపు, ప్రచార కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్యం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాల నాయకులు, అఖిల భారత యాదవ మహాసభ పదాధికారులు, యాదవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, యాదవ సమాజ ప్రముఖులు సమావేశానికి తప్పనిసరిగా హాజరై తమ సూచనలు అందించి యాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తిపై అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్, యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేణి రాజేందర్ యాదవ్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సలేంద్ర రాములు యాదవ్, అఖిల రత యాదవ మహాసభ యువజన విభాగం అధ్యక్షుడు అట్ల సాగర్ యాదవ్ సంయుక్తంగా పిలుపునిచ్చారు.

