
శెనార్తి మీడియా, కరీంనగర్:
నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్ నంబర్ 4లో ప్రహ్లాద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర మండపాన్ని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండపం నిర్వాహకులు, కాలనీ పెద్దలు మేయర్‌కు స్వాగతం పలికారు.
అనంతరం విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూజల అనంతరం మండపం నిర్వాహకులు మేయర్‌ను సన్మానించారు.


