Thursday, September 24, 2026
📄 ePaper
Homeజనరల్ న్యూస్సింగరేణి బిడ్డ(శ్రీకాంత్ ఓదెల)కు సమ్మక్క సెంటిమెంట్

సింగరేణి బిడ్డ(శ్రీకాంత్ ఓదెల)కు సమ్మక్క సెంటిమెంట్

📰 Generate e-Paper Clip

  •  ‘ది ప్యారడైజ్‌’లో హీరో తల్లి పేరు సమ్మక్క
  •  సింగరేణి కార్మికులకు సమ్మక్క-సారలమ్మలంటే ప్రత్యేక అభిమానం
  • సమ్మక్క పేరుతో రూపొందిన ఎమోషనల్‌ సాంగ్‌కు విశేష స్పందన
  • సినిమా విజయంతో పాటు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలకు శుభాకాంక్షలు

    సెంటిమెంట్లకు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంటుంది. కథ, పాత్రలతో పాటు కొన్ని నమ్మకాలను కూడా దర్శకులు, నిర్మాతలు, హీరోలు అనుసరిస్తుంటారు. ఇప్పుడు యువ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ‘ది ప్యారడైజ్‌’ విషయంలోనూ ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్‌ కనిపిస్తోంది.

    సింగరేణితో సమ్మక్కకు అనుబంధం

    తెలంగాణకు గుండెకాయగా భావించే సింగరేణి ప్రాంతంలోని కార్మిక కుటుంబాల్లో సమ్మక్క-సారలమ్మలను ఇష్టదైవాలుగా కొలిచే సంప్రదాయం ఉంది. వనదేవతలపై ఉన్న భక్తితో తమ పిల్లలకు సమ్మక్క పేరును కలిపి నామకరణం చేయడం కూడా అక్కడ కనిపిస్తుంటుంది. సింగరేణి నేపథ్యంతో అనుబంధం ఉన్న శ్రీకాంత్‌ ఓదెల సినిమాల్లోనూ ఈ సెంటిమెంట్‌ ప్రతిబింబిస్తోందనే చర్చ జరుగుతోంది.

    ‘ది ప్యారడైజ్‌’లో హీరో నాని తల్లి పాత్రకు ‘సమ్మక్క’ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని హీరో నాని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. సమ్మక్క పేరుతో రూపొందించిన ఎమోషనల్‌ సాంగ్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

    సింగరేణి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే సమ్మక్క.. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలకు కూడా అండగా నిలిచి ‘ది ప్యారడైజ్‌’ విజయవంతం కావాలని ఆయన శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.