Tuesday, October 13, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్పరిశుభ్రతే మన లక్ష్యం

పరిశుభ్రతే మన లక్ష్యం

📰 Generate e-Paper Clip

వెలిచాల సర్పంచ్​ వీర్ల నర్సింగారావు

శెనార్తిమీడియా, రామడుగు :

పరిశుభ్రతే మన లక్ష్యమని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్​ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా రామడుగు మండలం వెలిచాల అనుబంధం కిష్టారావుపల్లిలో 16వ శ్రమదానం- అయ్యవారికుంట ఆలయం, బతుకమ్మ ఘాట్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యవారికుంట భక్తాంజనేయ స్వామి దేవాలయం, బతుకమ్మ ఘాట్ పరిసరాల్లో శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ పరిసరాలు, ఘాట్ మెట్లు, కుంట గట్టు వెంబడి పేరుకుపోయిన చెత్త, ముళ్ల పొదలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన గ్రామమే మన లక్ష్యమని, ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ శ్రమదానం 16వ వారానికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.  గ్రామ ప్రజలందరూ శ్రమదానానికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉప సర్పంచ్ ఎల్లమ్మల వసంత, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.