Sunday, October 25, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్గంగాధర బ్లాక్ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం

గంగాధర బ్లాక్ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం

📰 Generate e-Paper Clip

అధ్యక్షుడిగా ఎన్నికైన చిరుత రమేశ్
శెనార్తిమీడియా, గంగాధర :
గంగాధర బ్లాక్ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా చిరుత రమేశ్, ప్రధాన కార్యదర్శిగా గంట రమేశ్ ను నియమించారు. కోశాధికారిగా మడ్లపల్లి మహేశ్, ఉపాధ్యక్షులుగా కట్ల కిరణ్, పడాల రాము, జారతి సత్తయ్య, గౌరవ అధ్యక్షులుగా గంట వెంకటేశం, కార్యవర్గ సభ్యులుగా చిందం రాజు, గంట హరీష్, సరిపెల్లి హరీష్, సామంతుల శ్రీనివాస్, పులిశెర్ల శ్రీనివాస్, బండారి వీరయ్య, జారతి ప్రశాంత్, కట్ల అరుణ్, కురుమల్ల హరీష్, జారతి శ్రీనివాస్, సలహా కమిటీ సభ్యులుగా సామంతుల నర్సయ్య, గంట కిషన్, కట్ల వెంకటేశం, జారతి నర్సయ్య, పోతరాజు వెంకటేశం, జారతి రాజన్న, సామంతుల మహిపాల్, పులిశెర్ల శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ మున్నూరుకాపు సంఘం బలోపేతానికి, సమాజ సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేస్తామని, సభ్యులందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.