Monday, October 26, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో కరీంనగర్‌ జట్లకు ప్రథమ స్థానం

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో కరీంనగర్‌ జట్లకు ప్రథమ స్థానం

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం:
కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌–14 బాలబాలికల వాలీబాల్‌ పోటీలు, సెలక్షన్స్‌ నిర్వహించారు. కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

బాలుర విభాగంలో కరీంనగర్‌ జట్టు ప్రథమ స్థానం, సిరిసిల్ల జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. బాలికల విభాగంలోనూ కరీంనగర్‌ జట్టు మొదటి స్థానం, సిరిసిల్ల జట్టు రెండో స్థానం దక్కించుకున్నాయి.

కరీంనగర్‌ జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు కేశవపట్నం ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భక్తు రాజ్‌కుమార్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా వ్యవహరించారు. గ్రామ సర్పంచ్‌ రాజేంద్రప్రసాద్‌, ఉపసర్పంచ్‌ విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో గ్రామ సీనియర్‌ క్రీడాకారుల సహకారంతో పోటీలను నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.