Wednesday, November 4, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్కళల్లో ఒకరు.. క్రీడల్లో ఇద్దరూ.. సత్తా చాటిన కవలలు

కళల్లో ఒకరు.. క్రీడల్లో ఇద్దరూ.. సత్తా చాటిన కవలలు

📰 Generate e-Paper Clip

శెనార్తిమీడియా, గంగాధర :

జిల్లాస్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో గంగాధర మోడల్ స్కూల్ స్టూడెంట్​ రావుల స్రాగ్వి ప్రథమ బహుమతి సాధించి తన అద్భుత ప్రతిభను చాటుకుంది. చిన్న వయస్సులోనే చిత్రలేఖనంలో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌లో టీజీఎంఎస్ గంగాధర పాఠశాల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచింది. ఈ జట్టులో చిత్రలేఖన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన రావుల స్రాగ్వితో పాటు కవల సోదరి రావుల స్నిగ్ధ  సభ్యులుగా ఉండడం విశేషం. ఒకే కుటుంబానికి చెందిన కవలలు తమకు నచ్చిన రంగాల్లో ప్రతిభను చాటుకుంటూ పాఠశాలకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలు, కళారంగాల్లోనూ విద్యార్థులు రాణించేలా పాఠశాలలో ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహం అందించడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, పీడీ నాగరాజు, ఉపాధ్యాయులు రావుల స్రాగ్విని, రావుల స్నిగ్ధలను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.