Thursday, November 5, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్మొలంగూరు క్వారీలో కాపర్ వైర్ చోరీ.. ఆరుగురు మహిళల గుర్తింపు

మొలంగూరు క్వారీలో కాపర్ వైర్ చోరీ.. ఆరుగురు మహిళల గుర్తింపు

📰 Generate e-Paper Clip

  • రూ.60 వేల విలువైన వైర్ స్వాధీనం..
  • గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • కేశవపట్నం ఎస్ఐ కె. శేఖర్ రెడ్డి

శెనార్తి మీడియా, శంకరపట్నం:

మొలంగూరు గ్రామ శివారులోని జువ్వాడి సత్యనారాయణ రావుకు చెందిన క్వారీలో కాపర్ వైర్ చోరీకి పాల్పడిన ఆరుగురు మహిళలను గుర్తించినట్లు కేశవపట్నం ఎస్ఐ కె. శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై క్వారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. చోరీకి గురైన సుమారు రూ.60 వేల విలువైన కాపర్ వైర్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఈ చోరీ ఘటనలో మానకొండూరు గ్రామానికి చెందిన సిరిగిరి కనకలక్ష్మి, కడమంచి రాజవ్వ, మోటార్ సమ్మక్క, మోటం ప్రమీల, కడమంచి భాగ్య, సిరిగిరి మైసవ్వలను గుర్తించినట్లు ఎస్ఐ వివరించారు.

అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలి

గ్రామీణ ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. వ్యవసాయ పొలాలు, క్వారీలు, నిర్మాణ ప్రాంతాలతో పాటు ఇతర ప్రదేశాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించాలని కోరారు.

ఎవరైనా అనుమానితులు గ్రామాల్లో తిరుగుతున్నట్లు గుర్తించినా, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేయాలని తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కె. శేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.