Thursday, November 5, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ఎయిర్​ రైఫిల్​ షూటింగ్​ పోటీలకు ‘సెయింట్ జార్జ్’ ఎంపిక

ఎయిర్​ రైఫిల్​ షూటింగ్​ పోటీలకు ‘సెయింట్ జార్జ్’ ఎంపిక

📰 Generate e-Paper Clip

శెనార్తిమీడియా, కొత్తపల్లి :

స్వదేశ్  షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా కరీంనగర్​లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్​ఐ ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఎంపిక పోటీల్లో కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్​ స్టూడెంట్స్​ అండర్​ 14 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్కూల్​ చైర్మన్​ పి.ఫాతిమారెడ్డి తెలిపారు. పీప్ సెట్​లో ఎన్.సుహాక్షి, ఓపెన్ సైట్​లో ఎన్.విన్మయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వీరు కరీంనగర్ జిల్లా తరఫున పాల్గొని అద్భుతమైన క్రీడా ప్రతిభతో ఈ ఘనత సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్.సుహాక్షి, ఎన్.విన్మయి నవంబర్ 24న ఖమ్మంలో జరుగనున్న పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.