Friday, November 6, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్జూడో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

జూడో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

📰 Generate e-Paper Clip

 

  • కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
  • కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో సబ్ జూనియర్ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు

శెనార్తి మీడియా, కరీంనగర్  స్పోర్ట్స్:

క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటాలని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.

కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో బాలబాలికల సబ్ జూనియర్ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. జూడో క్రీడ బాలికలకు ఆత్మరక్షణలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పతక విజేత జి. నవీన్‌ను సన్మానించారు.

ఈ నెల 14, 15 తేదీల్లో ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి కరీంనగర్ జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని జిల్లా జనరల్ సెక్రటరీ ఎస్. దామోదర్ ఆకాంక్షించారు. క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్న రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌తో పాటు కోచ్‌లు సాయిరాం, శ్యామ్‌లను మేయర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో జూడో అసోసియేషన్ అధ్యక్షుడు సాధవేని వినయ్ కుమార్, ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాస్, జిల్లా ట్రెజరర్ సిరికొండ రవీంద్రాచారి, గోలి సుధాకర్, శ్రీధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.