Friday, November 6, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

శెనార్తిమీడియా, రామడుగు :

రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట, మోతె, రామడుగు, షానగర్, కిష్టాపూర్ గ్రామాల్లో పీఏసీఎస్ – ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించి, రైతును ఆదుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా, తమ పంటను నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని లబ్ధి పొందాలని కోరారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం రామడుగు మండల కేంద్రంలోని ఆర్ఎంపీ భవనంలో నూతన బోరు పంపును ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయంలో 25 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 50 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు, 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్​ కాపీలను అందజేశారు. కార్యక్రమంలో రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.