శెనార్తిమీడియా, రామడుగు :
రామడుగు మండలం వెలిచాలలో వరల్డ్ టాయిలెట్స్ డేను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన వాడీ కేంద్రాలు, ఇళ్లలోని టాయిలెట్లను పూలతో అలంకరించారు. అనంతరం సర్పంచ్ వీర్ల నర్సింగారావు మాట్లాడుతూ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో, టాయిలెట్లను కూడా శుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

