మార్చిలోపు బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇస్తామని అధికారుల హామీ
శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలం అర్కండ్ల వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ గ్రామస్థులతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. వాగులోకి దిగి సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చిన పాలకులు అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన ఏడాదిలోగా హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణంపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించబోనని విశారదన్ మహారాజ్ పట్టుబట్టారు. దీంతో తహసీల్దార్ సురేఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎస్సీ భీమ్లా నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడించగా, వచ్చే మార్చిలోపు హైలెవల్ బ్రిడ్జికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయించి, నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో విశారదన్ మహారాజ్ గ్రామస్థులతో కలిసి నిరసన విరమించారు. ఈ ఆందోళనలో గ్రామ సర్పంచ్ నేదురు పవన్, మాజీ ఉప సర్పంచులు చెర్ల శ్రీనివాస్, సంపత్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు యమునూరి ప్రశాంత్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఎండీ సల్మా, గ్రామస్థులు పాల్గొన్నారు.


