ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
వెంకంపల్లి, ఇస్లాంపూర్ గ్రామాల్లో మహిళా సంఘం భవనాల ప్రారంభం
శెనార్తిమీడియా, గంగాధర :
మహిళలే కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకంపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం, ఇస్లాంపూర్, వెంకంపల్లి గ్రామాల్లో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతితో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మహిళా సంఘం భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, స్థానిక సర్పంచులు గుండవేణి లావణ్య– తిరుపతి, బారాజు ప్రభాకర్ రెడ్డి, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి పురుమల్ల మనోహర్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు చిరుత మంగ, మాజీ జడ్పీటీసీలు కనుకయ్య, గునుకొండ బాబు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, సర్పంచులు రామిడి రాజిరెడ్డి, దానె ఓదెలు, పడాల భాగ్యలక్ష్మి– రాజన్న, రాచమల్ల రవి, బాసవేని శ్రీనివాస్, రేండ్ల శ్రీనివాస్, గుడి రజని– ప్రవీణ్ రెడ్డి, కోలెపాక కవిత– మల్లేశం, బీర్ల ఆనందం, కడారి రేణుక– కనుకయ్య, శ్రీనివాస్, రాజశేఖర్, నాయకులు కర్ర బాపురెడ్డి, సాగి అజయ్ రావు, గుజ్జుల బాపురెడ్డి, మేర్జ కొండయ్య, కడారి కుమారస్వామి, భారతి, కవిత తదితరులు పాల్గొన్నారు.


